కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం

ఖిల్లా ఘనపురం మండలం ఆగారం గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన 80 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

వరికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల BRS పాలనలో గ్రామం ఎటువంటి అభివృద్ధి సాధించలేదని నేడు ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆగారం గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు

15 రోజుల్లో రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆగారం గ్రామం నుంచి భారీ మెజారిటీ రావాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గారిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు

ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాయిచరణ్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జయకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణయ్య, మాజీ సర్పంచ్ తెలుగు బాలయ్య మాజీ ఉప సర్పంచ్ నరేష్, మానాజీపేట్ మాజీ సర్పంచ్ సతీష్, గ్రామ నాయకులు రవికుమార్ శ్యామసుందర్రావు, కాజ మైనుద్దీన్, సాయిబాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు