ఖిల్లా ఘనపురం మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ప్రస్తుతం మాజీ సర్పంచ్ మన్నెమ్మ రాములు తో పాటు 80 మంది BRS పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుందామని ముందుగా తాగునీటి సమస్యను పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి గ్రామం నుంచి అత్యధిక మెజారిటీని అందించాలని ఆయన గ్రామస్తులను కోరారు