కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకం పకడ్బందీగా అమలు చేస్తుంది

లింగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఏర్పాటు చేయడమైనది దాంట్లో భాగంగా ఈరోజు స్థానిక ఎంపీడీవో ఆవరణంలో ఇందిరా మోడల్ హౌస్ కు శంకుస్థాపన చేయడం జరిగింది.

అనంతరం ప్రభుత్వం ఆరూ గ్యారెంటీ స్కీం లలో గృహజ్యోతి పథకంలో మహిళలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ లకు సంబంధించిన ప్రొసీడింగ్ లను పంపిణీ చేయడం జరిగింది…. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకంగా అమలు చేయడం జరిగింది.