క్రీడాకారిణికి శాలువాతో సన్మానించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.

పెబ్బేరు మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన కొండయ్య ,భాగ్యమ్మల  కుమార్తె నందిని కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపీకైంది.డిసెంబర్ 23వ తేదీన బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అండర్ 17 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయింది.విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో  ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై వస్తు మార్గంమధ్యలో మాంటిస్సోరి పాఠశాల వద్దకు చేరుకొని క్రీడాకారిణిని  శాలువా, పూల మాలలతో సన్మానించారు.మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చదువుతోపాటు క్రీడలపై కూడా శ్రద్ధ వహించిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నందినిని ఆయన అభినందించారు.శిక్షణ ఇచ్చిన PT మాస్టర్ మహేష్ కు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మండల నాయకులు శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడ్ వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.