వనపర్తి పట్టణంలోని RG గార్డెన్లో ఏర్పాటు చేసిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు మరియు ఉపాధి అవకాశాల ఏర్పాటు అవగాహన, శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, ఈ క్రమంలోనే చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు, ప్రైవేటు పరిశ్రమంలో ఉపాధి కల్పన కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవగాహన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని తెలియజేయడం జరిగింది..
ఉన్నత విద్య, సాంకేతిక విద్యలలో ఎంతో ప్రావీణ్యం ఉండి, సరైన ప్రోత్సాహం లేక వెనకబడి పోయే నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి, చిన్న మధ్యతరః పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు సంబంధిత బ్యాంకర్లు సానుకూలంగా ఉన్నారని వారు కల్పించే ఈ అవకాశాన్ని యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది.
వనపర్తి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన యువతి యువకులు గ్రామాల్లోని అందరికీ అవగాహన కల్పించాలని అవసరమైతే మరో వారం రోజుల్లో మరో కార్యక్రమం నిర్వహించుకుందామని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో DCCB చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కార్యక్రమానిర్వాహకులు అవార్డు ఏజెన్సీ సభ్యులు,పారిశ్రామికవేత్తలు, పలు బ్యాంకుల మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, అధికారులు వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు..