ఖిల్లా ఘణపురం మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన చౌడమ్మ ఉత్సవాలలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ తూడి మేఘా రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చౌడమ్మ పండగ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే గారిని గ్రామస్థులు డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చౌడమ్మ ఆలయం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి, ఆటో యాదవుల కోసం సామూహిక భవనం ఏర్పాటు చేయడంపై తన ప్రతిజ్ఞను ప్రకటించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రావు, సాయి చరణ్ రెడ్డి, మల్లేష్, కృష్ణయ్య, రాజు, శ్యాంసుందర్ రెడ్డి, నరసింహారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.