ప్రజా దర్బార్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు… ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజా దర్బార్ ముఖ్య లక్ష్యం… ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా నేడు జడ్చర్ల కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ ఫిర్యాదులను ఎమ్మెల్యే గారికి వివరించారు…
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
నేడు మా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలు మాకు ఇచ్చిన ఫిర్యాదులన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు…
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని అడగడం జరిగిందన్నారు…
మంత్రిగారు స్పందించి ఆ యొక్క సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారని అన్నారు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ ల గురించి అడగడం జరిగిందన్నారు.
మీరు ఫ్లైఓవర్ల గురించి నాకు లెటర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఫ్లైఓర్ లు శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తానన్నారని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని ముఖ్యమంత్రి మాకు తెలియజేశారన్నారు. నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో మా కార్యకర్తలను, నాయకులను అడిగి తెలుసుకుని సమస్యలున్న దగ్గర ఆ యొక్క డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు…
#Prajadarhar #Prajadarbar #Jadcherla
