జడ్చర్ల గడ్డ కాంగ్రెస్ అడ్డ అన్నట్టుగా భారీ సంఖ్యలో ప్రభంజనంల ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు…
ముఖ్య అతిథులకు భారీ గజామాలతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు…
జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యఅతిథి CWC ప్రత్యేక అహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు,ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలు…

జడ్చర్ల కేంద్రంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి నేడు ముఖ్యఅతిథి CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు,ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు మరియు సహచర ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, ఎమ్మెల్సీ NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ గారు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు హాజరయ్యారు…
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
గత 10 సంవత్సరాల బిఅర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల నియోజకవర్గంలో భూ దందాలు, భూ కబ్జాలు, నల్లమట్టి అవినీతి దందాలను ప్రోత్సహించారని అన్నారు…
తొందర్లోనే బిఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలన్నిటిని బయట పెట్టి అవినీతి కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు…
జడ్చర్ల నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తయారు చేస్తానని అన్నారు…
జడ్చర్ల నియోజకవర్గంలో ఏ కార్యకలాపాల్లో కూడా అవినీతి జరగకుండా శ్రద్ధ తీసుకొని ప్రజలకు నాణ్యమైన ప్రజా పరిపాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు…

నా గెలుపు కోసం అహర్నిశలు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలు అందరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని తెలిపారు…
వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో 50% యువకులకు అవకాశాలు కల్పించి వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని భరోసా కల్పించారు…
గత 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో మహబూబ్ నగర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలను ఏ విధంగా కష్టపడి గెలిపించారో అదే విధంగా కష్టపడి పనిచేసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మహబ్ నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు…
