డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని నివాళులు అర్పించిన వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి నవభారత నిర్మాణానికి దశ దిశ నిర్దేశించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారని ఎమ్మెల్యే పేర్కొన్నారు అలాగే సమ సమాజ స్థాపనకు అహర్నిశలు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించి దశ దిశ నిర్దేశం చేసిన ప్రపంచం మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు పేర్కొన్నారుఅంబేద్కర్ ఆశయ సాధన సాధించిన నాడే ఆయనకు నిజమైన నివాళి లభిస్తుందని ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని ఆయన సూచించారుడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాదులోని మాదాపూర్ లోగల అయ్యప్ప సొసైటీలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారుఈ కార్యక్రమంలో నాయకులు సాయి చరణ్ రెడ్డి, తిరుపతిరెడ్డికృష్ణ, ప్రేమ్ యాదవ్, చరణ్ యాదవ్, సర్దార్, రాము, షాన్, గోపాల్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు