తెలంగాణ హక్కుల రికార్డు ముసాయిదా బిల్లు 2024

వనపర్తి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ హక్కుల రికార్డు ముసాయిదా బిల్లు 2024 పై నిర్వహించిన సలహాలు-సూచనల సమావేశంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

ఈ సమావేశంలో రైతులు, రైతు సంఘాల నాయకులు, సంబంధిత అధికారులతో చర్చించి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది.

అలాగే గత ప్రభుత్వం ధరణి ద్వారా అనేక మోసాలకు పాల్పడి, రైతులను నట్టేట ముంచిందని అన్నారు. ఈ ధరణి సమస్యలు లక్షల్లో పేరుకుపోయాయని గుర్తు చేశారు. ఈ సమస్యలకు అన్నింటికీ పరిష్కారం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో భూ ఆధార్ ద్వారా చూపిస్తామని అన్నారు. కొంతమంది ప్రభుత్వ అధికారుల నిర్లక్షం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వ అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘరెడ్డి గారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి గారు, మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు, దేవరకద్ర శాసనసభ్యులు గవినోళ్ల మధుసూదన్ రెడ్డి గారు,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళ పల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ సునీల్ గారు మరియు రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు