నాగర్ కర్నూల్ ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డాక్టర్ మల్లు రవి గారి విజయోత్సవ ర్యాలీలో పాల్గొని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ BRS పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మట్టి కొట్టుకుపోయిందని BRS పార్టీని 100 అడుగుల లోతూలో బొంద పెట్టామని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
అలాగే విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందించారు.
తన విజయం కోసం కష్టపడిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి నాగర్ కర్నూల్ ఎంపీ గౌరవ శ్రీ డాక్టర్ మల్లు రవి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.