నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో చిన్న సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత అవగాహన కార్యక్రమం

గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారితో కలిసి అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల రూపకల్పన ద్వారా నిరుద్యోగ యువత ఏ విధంగా స్వయం ఉపాధి ఏర్పరుచుకోవాలి,వారు ఆర్థికంగా ఎలా బలపడాలి, వారి వారి ప్రాంతాలలో ఎలాంటి పరిశ్రమలు నిర్మించుకోవాలి వాటికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన ప్రోత్సాహకాలను అందిస్తుంది వాటికి ఎవరెవరు అర్హులు అనే అంశాల మీద అహగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.

నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కోసం సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందియంగ్ ఇండియా స్కిల్స్ ద్వారా యూనివర్సిటీలో పలు రకాల కోర్సులు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి. అంతర్జాతీయ జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా యూనివర్సిటీ ద్వారా కృషి చేస్తుందనీ సూచించడం జరిగింది.