తను విద్యను అభ్యసించిన పాఠశాలకు 5 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
శనివారం ఖిల్లా ఘనపురం మండలం బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. పాఠశాల సమస్యలను చూసి నేను చదువుకున్న పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని నేను చదువుకున్న పడసల అభివృద్ధికి ఐదు లక్షల విరాళం అందజేయడం జరిగింది.తాను విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి తాను ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని.
అలాగే నాతో చదువుకున్న స్నేహితులు నా సహచర పూర్వ విద్యార్థులు సైతం పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని చెప్పడం జరిగింది
అనంతరం పాఠశాలలో అదనపు గదుల కొరత ఉందని మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన పాఠశాలకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని వారికి చెప్పడం జరిగింది.
పాఠశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి వినియోగంలోకి తీసుకురావాలని గుత్తేదారును ఆదేశించాను.
అలాగే సరదాగా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులు చదువు బాగా చెబుతున్నారా అంటూ మరియు పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
