పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామంలో. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాల కార్యక్రమం లో పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ _పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని_ _అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు_ ఉప్పునుంతల మండలం మొల్గరగ్రామంలో నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చడం లో ముందుకు సాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అర్హులైన ప్రతిఒక్కరి కూడా రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందరికీ అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి… ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ పథకాలను చూసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు.. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు ఏమాత్రం సంక్షేమ పథకాలు అందించలేని నియంతృత ప్రభుత్వం ఈరోజు నాలుగు సంక్షేమ పథకాలను ఒకటే రోజు ప్రారంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు.