పోచమ్మ తల్లి పండుగలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి గారు

ఖిల్లా ఘనపూర్ మండల పరిధిలోని ఎనికితండా దొంతికుంట తండాలో బుధవారం నిర్వహించిన పోచమ్మ తల్లి ఉత్సవాల్లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పండుగ సందర్భంగా ఆ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయలక్ష్మి రాజు ,భాషా నాయక్ సర్పంచ్ సతీష్,సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, వెంకట్రావు,వెంకటయ్య,శ్యామ్, సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.