పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాల లబ్ధిఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఈ ప్రజా పాలన కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.శనివారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని 11వ వార్డు రామ్ నగర్ కాలనీ 31 వార్డు కేటీఆర్ నగర్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారుగత పది సంవత్సరాల BRS పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకునే నాధుడే లేడని, ప్రభుత్వ భూముల కబ్జాలు కమిషన్ల పైనే దృష్టి సారించి నాయకులు కోట్లకు పడగలెత్తరని ఆయన విమర్శించారు.నేటి నుంచి ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన పేర్కొన్నారుజనవరి 6వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని అందులో ఎలాంటి సందేహాలు ఉండకూడదని ఆయన అన్నారు.అధికారులు దరఖాస్తులు స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చూసుకోవాలని ఆయన ఆదేశించారుకార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు సుమిత్రయాదగిరి, రాధాకృష్ణ, జయసుధ మధుసూదన్ గౌడ్, చీర్ల సత్యం సాగర్, విభూతి నారాయణ, కోఆప్షన్ సభ్యురాలు కైరున్ షఫీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ పట్టణ మున్సిపల్ కమిషనర్విక్రమ్ సింహారెడ్డి, పట్టణంలోని