కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
నేడు ఖిల్లా ఘనపురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంకు హాజరై 44 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రానున్న రోజుల్లో మహిళా సంఘాలన్ని ఆర్థిక అభివృద్ధి సాధిస్తాయి.
మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నేడు పాఠశాల, వసతి గృహాల విద్యార్థులకు యూనిఫాంలను కుట్టించి ఇచ్చే ప్రక్రియను వారికి అప్పగించింది
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి పనిలో మహిళలకు మొదటి ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.