వనపర్తి జిల్లా కేంద్రం లోని( MCH) ప్రసూతి హాస్పిటల్ ని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
హాస్పిటల్ ని సందర్శించి చిన్నారులకు, బాలింతలకు,గర్భవతులకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలనీ వైద్యాధికారులను ఆదేశించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారికి సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్స్ గర్భిణీ స్త్రీలతో, చిన్నారులతో ఎలా వ్యవహరిస్తున్నారు అని వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
అనంతరం ప్రసూతి హాస్పటల్లో బాలింతలకు చిన్నారులకు, గర్భవతులకు అందించే వైద్య సేవల గురించి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.