శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పరీక్షించడం జరిగింది. అలాగే పాఠశాలలో ఉన్న అన్ని సమస్యలు తెలుసుకుని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొనడం జరిగింది.
అలాగే గ్రామస్తుడు అయినటువంటి నాగరాజు తన సొంత నిధులతో పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, దాన గుణం ఉన్న వ్యక్తులు గ్రామ అభివృద్ధి కాంక్షించే యువకులు ఉన్న గ్రామం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని ఇలాంటి దానగుణం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను..

పాఠశాలలో సరైన గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గ్రహించి అత్యవసరంగా రెండు గదులను వెంటనే నిర్మించాలని అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తాను చేస్తానని గ్రామస్తులకు సూచిస్తాం..
విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని ఈ క్రమంలోనే “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ కు శ్రీకారం చుట్టిందని.
దీంతో రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసి మూడవ తరగతి నుంచి డిగ్రీ వరకు అత్యుత్తమ విద్యను అందించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఉపయోగపడతాయని వివరించం
ఈ సందర్భంగా పాఠశాలలో తాగునీటి శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నాగరాజును ప్రత్యేకంగా అభినందించం
యువకులు ముందుకు వచ్చి గ్రామంలో మూకుమ్మడి శ్రమదాన కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని దాంతో గ్రామానికి అత్యుత్తమ పురస్కారాలు లభిస్తాయని యువకులకు సూచించం
గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు ఉండాలని తనవంతు సహాయ సహకారాలు ఎప్పటికి అందిస్తానని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు భారతి, ఎంపీడీవో రవి నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, మండల నాయకులు శ్రీహరి రాజు, బీరం రాజశేఖర్ రెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
