శ్రీరామనవమి సందర్భంగా బుధవారం వనపర్తి మండలం చివనుగుంటపల్లి గ్రామంలో నిర్వహించిన బండలాగులు పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై పోటీలను ప్రారంభించారుపోటీ నీ ప్రారంభించేముందు ఎమ్మెల్యే గారు అ గ్రామంలోని సీతారామును దర్శించుకుని పోటీని ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండలాగుడు పోటీలు పట్టుదలకు నిదర్శనమని గ్రామాలలో ఇలాంటి బండలాగుడు పోటీలు తగ్గిపోతున్నాయని ఇలాంటి పోటీలకు ఎంతో ఆదరణ ఉందని ఆసక్తిగల వ్యక్తులు ఇలాంటి పోటీలను గ్రామాల్లో నిర్వహిస్తే ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటుందని ఎమ్మెల్యే గారుపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు మండలాలు పోటీ కార్యక్రమా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.