బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు భోజనం పెట్టలేదనేది అవాస్తవం

బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు భోజనం పెట్టలేదనేది అవాస్తవం. పదవ తరగతి విద్యార్థులు ఉపవాసం ఉండడంతో పక్కనే ఉన్న గంగమ్మ దేవాలయంలో భోజనం స్వీకరించారు మిగిలిన విద్యార్థులకు వసతి గృహంలోనే భోజనం ఏర్పాటు చేశారు కొండనాగుల ఎస్టీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.

కొండనాగులలో బాలుర ఎస్టి వసతి గృహంలో విద్యార్థులు పస్తులు ఉంటున్నారని తప్పుడు సమాచారంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోలేని. అసమర్థత ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు తన ట్విట్టర్ వేదికగా వాస్తవం తెలుసుకోకుండా ప్రజా ప్రభుత్వాన్ని బదనం చేయాలని కుట్రలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొండనాగుల బాలుర ఎస్టి వసతిగృహంలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు శివరాత్రి పండుగ సందర్భంగా ఉపవాసం ఉండడం జరిగింది కొంతమంది విద్యార్థులు స్థానికంగా ఉండే గంగమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన ఉపవాస కార్యక్రమానికి హాజరైనారు మిగిలిన విద్యార్థులు వసతి గృహం లోనే భోజనం ఏర్పాటు చేయడమైనది వాస్తవం తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఉద్దేశంతో కేటీ రామారావు గారు ట్విట్టర్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

బిఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో సంక్షేమ వసతి గృహాలు గురుకుల గురుకులాలను పట్టించుకునే నాధుడే లేడు . ఇప్పుడు ఈ యొక్క ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు మిస్ చార్జీలు గాని కాస్మోటిక్ చార్జీలను పెంచి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు వాస్తవం తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికైనా బుద్ధిమానుకొని క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలన చేసి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ కు హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో డి టి డబ్ల్యూ వార్డెన్లు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు మండల నాయకులు పాల్గొన్నారు.