బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

గురువారం పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ ప్రమాదవశాత్తు మృతి చెందాడంతో విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు వనపర్తి జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతి చెందిన ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉంటామని వారి కుటుంబానికి తగిన సహాయం చేస్తానని ఎమ్మెల్యే గారు భరోసా కల్పించారు.

అదేవిధంగా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుద్ధారం గ్రామానికి చెందిన భీమయ్య

పెద్దగూడెం బాలమ్మ, రాములు,మోజర్ల తిరుపతమ్మ

పెద్దమందడి గ్రామానికి చెందిన చెన్నయ్యలను ఆయన పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.