మత్స్య కళాశాలను సందర్శించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పెబ్బేరు మండల కేంద్రంలో గల మత్స్య కళాశాలను సందర్శించడం జరిగింది. కళాశాల ఉపాధ్యాయులు పలు సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు.తాగునీటి సమస్య డంపింగ్ యార్డ్, విద్యార్థులకు రాకపోకలకు సంబంధించి బస్ స్టాప్,కళాశాలకు రహదారి,స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించాలని ఉపాధ్యాయులు కోరడం జరిగింది.

అందుకు సానుకూలంగా స్పందించి కళాశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కు సంబంధించిన ప్రతిపాదనలను తయారుచేసి ఇవ్వాలని సూచించించడం జరిగింది

అలాగే విద్యార్థులకు ఉద్యోగం కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మత్స్య కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు సైతం ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సూచించాను.

అనంతరం కళాశాలలో ఏర్పాటుచేసిన చేపలు పెంపకం, రొయ్యల పెంపకం పాండ్స్ ను సందర్శించ వాటి పెంపకం వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.