మహారాష్ట్ర రాష్ట్రంలోని డిగ్రాస్ నియోజకవర్గంలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల ప్రక్రియపై, అక్కటి రాజకీయ పరిస్థితులపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యి పలు విషయాలపై చర్చించడం జరిగింది.
డిగ్రాస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఎంపికైన తను గత రెండు రోజులుగా నియోజకవర్గ రాజకీయాలపై ఆరా తీస్తు పూర్తి సమాచారాన్ని సేకరించడం జరిగింది.
ఈ సందర్భంగా డిగ్రాస్ నియోజకవర్గానికి విచ్చేసిన తమరికి మాణిక్ రావు ఠాక్రే కుమారుడు ,రాహుల్ ఠాక్రె గారు శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు
అనంతరం దర్వా నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో NSUI అధ్యక్షులతో సమావేశం కావడం జరిగింది.
రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది.