మీ సేవలు వెలకట్టలేనివి

ధన్యవాదాలు DNR గారు

ఊర్కొండ: (మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి DNR) గారి సేవలు వెలకట్టలేనివని కాంగ్రెస్ యువ నాయకులు కొండపల్లి కొండల్ తెలిపారు. మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామంలో రెండు హైమాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండపల్లి కొండల్ మాట్లాడుతూ…నిఖిల్ అన్న పుట్టినరోజు సందర్భంగా తన స్వంత నిధులతో రెండు హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసి ప్రారంభించడం అంటే నేటి సమాజంలో ఏమి వస్తుందనే నాయకులను చూశాము కానీ….నిస్వార్థంగా తన స్వంత నిధులతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నా నిఖిల్ అన్న ను చూస్తుంటే ఇలాంటి నాయకుడు నేటి సమాజానికి …. భావి తరాలకు అవసరమని తెలియజేసుకుంటు, భవిష్యత్తులో మా గ్రామానికి మరింతా తోడ్పాటును ఇవ్వాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమి, ధర్మకర్తల మండలి సభ్యురాలు రజిత చంద్రశేఖర్ గౌడ్ కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ, NSUI మండల అధ్యక్షుడు కైసర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి మాసుం నాయకులు మనోహర్ రెడ్డి, వహీద్, దార రాజు, కంఠం రాములు, రఫీఖ్, గ్రామస్థులు సాయికుమార్, లక్ష్మయ్య, కోటేశ్వర్, ఆనంద్, శ్రీశైలం, రాఘవేందర్, అశోక్, ఆంజనేయులు, బోయిని రాములు, వెంకటయ్య గౌడ్, బోయిని ఆంజనేయులు, భిక్షపతి తదితరులు ఉన్నారు