ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

కార్యక్రమంలో మాట్లాడుతూ

ఈనెల 30 న మహబూబ్ నగర్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించడం జరిగింది.

ప్రజాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు 10 లక్షల ఆరోగ్య భీమా ,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ,200 యూనిట్ల ఉచిత కరెంటు ,500 కి గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచించడం జరిగింది.

వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలో ఐదు వందల పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరత ఉందని, ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లామని దీంతో ఆయన తక్షణమే స్పందించి 500 పడకల ఆసుపత్రిగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్, మార్కెట్ కమిటీ చైర్మన్ వనపర్తి, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్, కో ఆప్షన్ నెంబర్స్ ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, వికలాంగుల ,మత్స్యకార, సోషల్ మీడియా, యూత్ కాంగ్రెస్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అన్ని మండలాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు , జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు ,ఎంపీపీలు,మాజీ సర్పంచులు, ఎన్ ఎస్ యు ఐ,ఐ ఎన్ టి యు సి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది