తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేక భేటీ కావడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.వనపర్తి నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తాను ఎల్లవేళలా సహకరిస్తానని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.