ముస్లిం సోదరులకు రంజాన్ (తోఫా)

ఊర్కొండ: మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ (తోఫా) కానుకగా వాటర్ ఫిల్టర్ అందజేసిన మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఊర్కొండ ముస్లిం మత పెద్దలు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం దీక్ష విరమణ (ఇఫ్తార్) సమయంలో మస్జీదులో చల్లటి నీరు తీసుకునేందుకు వాటర్ ఫిల్టర్ ను అందజేయడం సంతోషం కలిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షబ్బీర్ గారు, అరిఫ్ గారు, జబ్బార్ గారు, రఫీఖ్ గారు, ఫక్రుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఆదినారాయణ, మాజీ వార్డు సభ్యులు రవి వాల్మీకి, నాయకులు దయాకర్, పోలె భాస్కర్, దారా రాజు, కంఠం రాములు, కృష్ణయ్య, రమేష్ తదితరులు ఉన్నారు