ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన సాటు చిన్న భీమయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో NSUI మండల అధ్యక్షుడు కైసర్, నాయకులు అమ్ము, ఇంతియాజ్, కప్పేర శంకర్, కోట్ర వెంకటయ్య, కప్పేర నరసింహ, కప్పేర జంగయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.