మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన బురాన్ బీ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమీ నాయకులు అశు, కప్పేర చంద్రయ్య, అశోక్, జహీర్, చుక్కపురం అంజయ్య గౌడ్, చాంద్ పాషా, మ్యాకల శ్రీనివాసులు, మాసుం, మహబూబ్ అలీ, సద్దాం తదితరులు పాల్గొన్నారు.