యాదవ ఆత్మీయ సమ్మేళన

వనపర్తి పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటుచేసిన యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరై ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.

తనను ఎమ్మెల్యేగా గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన యాదవులందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటాను.

అలాగే వేలకు వేలు డీడీలు చెల్లించి గొర్రెలు వస్తాయని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న యాదవ సోదరులకు బీఆర్ఎస్ పార్టీ మొండిచేయి చూపించింది.యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తామని ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు నమ్మకూడదు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ మల్లు రవి గారికి తమ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదిస్తే ఎంపీగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేస్తారు.

రానున్న ఐదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు , ఎంపీగా మల్లు రవి గారు, ఎమ్మెల్యేగా నేను, వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాం.

కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే యాదవ సోదరులకు అండదండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యేగా నేను కొనసాగినంత కాలం యాదవులకు ప్రభుత్వ పరంగా సహకారాలు అందజేస్తానని

వారికి భరోసా ఇవ్వడం జరిగింది