యువత సన్మార్గంలో నడుస్తూ క్రమశిక్షణగా ఉండాలని అప్పుడే దేశం అత్యున్నత ప్రగతిని సాధించేందుకు వీలవుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారుశనివారం వనపర్తి ఫ్రెండ్స్ యుత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను పంపిణీ చేశారుఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52 జట్లు పోటీల్లో పాల్గొన్నాయని నిర్వాహకులు ప్రకాష్, రెడ్డి, రఫీక్,మూర్తి, తిరుపతిలు పేర్కొన్నారుమొదటి విజేత రెహమాన్ 11 కు ప్రైజ్ మనీ 30000 రెండో విజేత నక్షత్ర 11కు ప్రైజ్ మనీ 20000 మూడో విజేత దత్తాయపల్లి జట్టుకు నగదు బహుమతి 10000 ల తో పాటు షీల్డ్ లను ఎమ్మెల్యే అందజేశారుకార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు