రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

భోగి పండుగ సందర్భంగా శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు,వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని పర్యట ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు తెలిపారు.అలాగే రంగసముద్రం ప్రధాన కాలువ పరిశీలించారు వీటితోపాటు జూరాల కాలువలు మరమ్మత్తులు చేయించి రైతులకు నీళ్లు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు.