రాజాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ సంఘం PRTU క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు…
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభా గల ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య బోధన అందుతుందని అన్నారు.పారిశ్రామికవేతలందరినీ జడ్చర్ల నియోజకవర్గానికి పిలిపించి ప్రతి ఒక్కరికి ఒక స్కూల్ ను అప్పగించి అభివృద్ధి చేయాలని సూచిస్తానని అన్నారు.ఎమ్మెల్యే గారి సొంత నిధులతో పాఠశాలలో మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన బోధనను సక్రమంగా అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు…
#Rajapur