రెండవ రోజు ఫారెస్ట్ స్టడీ టూర్

రెండవ రోజు ఫారెస్ట్ స్టడీ టూర్ భాగంగా మహారాష్ట్ర తడోబా కందారే టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆరు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించి రీ లొకేషన్ చేశారు. ఐదు గ్రామాలను రీ లోకేట్ పునరావాస కేంద్రాలుగా మార్చారు అందులో ఒక గ్రామాన్ని సందర్శించడం జరిగింది.

పురావస కేంద్రంగా మార్చిన గ్రామంలో అంగన్వాడి ,స్కూలు, గ్రామపంచాయతీ ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పునరావాస బాధ్యులకు ఇచ్చినటువంటి భూములను సంబంధించిన మొదలైనటువంటి మౌలిక వసతులను కల్పించారు.. వాటన్నిటిని సందర్శించే వివరాలు తెలుసుకోవడం జరిగింది…. పునరావాస ప్రాంతానికి వెళ్లేటటువంటి వారికి కూడా అన్ని రకాల సకల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది అందరం కూడా అడవిని సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అడవిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.