వంగూర్ మండలం ఉల్లంపల్లి గ్రామంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సంస్కృత ఆదికవి, శ్రీ రామాయణ మహాకావ్య రచయిత మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ రామాయణాన్ని మహా కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నతలు మహర్షి వాల్మీకి గారు అని కొనియాడారు . ప్రజా ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారిక సాంస్కృతిక కార్యక్రమంగా నిర్వహిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ గుర్తుచేశారు.