వంగూరు మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం

డీసీసీ అధ్యక్షులు& MLA డా చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తో కల్వకుర్తిలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

టిపిసిసి ఆదేశానుసారంగా గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ కమిటీలు ఏర్పాటు మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాజీవ్ యువ వికాసం, సంక్షేమ పథకాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. వంగూరు మండలంలోని ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని నాయకులకు ఆదేశించారు వీలైనంత త్వరగా ప్రతి గ్రామంలో మండల కమిటీ బాధ్యులు పర్యటించి గ్రామ కమిటీలు ఏర్పాటుకు కృషి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు కేబీఎన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పండిత్ రావు, రమేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లయ్య, అల్వాల్ రెడ్డి, తన సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు