వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతలు

శుక్రవారం వనపర్తి నంది హిల్స్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన జిల్లా గొర్రెల కాపరుల సంఘం ఉపాధ్యక్షులు కందూరు చంద్రయ్య, మాజీ సర్పంచ్ లోకా రెడ్డితో పాటు మరో 50 మంది BRS కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

వీరికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు ఎలాంటి గౌరవం దక్కలేదని కేవలం ప్రజా ప్రతినిధులుగా ఉన్నామే తప్ప పాలన మాత్రం మా చేతులలో లేకుండా ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు

కార్యక్రమంలో గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు