వనపర్తి పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రత్యేక సమావేశం

వనపర్తి పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు.ప్రభుత్వపరంగా మున్సిపాలిటీకి ఆదాయాన్నిచ్చే హౌస్ టాక్సెస్ ఇతర వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని అధికారులు వారి విధులను ఎందుకు విస్మరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.మున్సిపల్ సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఇకపై జరిగే ప్రతి మున్సిపాలిటీ సమావేశానికి అందరూ అధికారులు తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారురోడ్డు వైన్డింగ్ లో 10 కోట్లకు పైగా పెండింగ్ పనులు ఉన్నాయని వాటి నిధులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో కలెక్టర్లు చర్చించారని అందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని పనులు ఎప్పటిలాగే కొనసాగుతాయని ఆయన. పేర్కొన్నారుఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, స్థానిక కలెక్టర్ గాంగ్వార్ , కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి,కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు