వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రంగాపూర్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలును గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ మాట్లాడుతూ రైతు భరోసా రెండు విడతలు దీపావళి నాటికి రైతులకు అందజేయడం జరుగుతుంది రైతులు పండించిన ఏ పంటకైనా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ధాన్యం కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారుకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో రైతులందరికీ న్యాయం చేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది.నాలుగు లక్షల మందికి దీపావళి నాటికి రుణమాఫీ చేయడం జరుగుతుంది.
రైతు రుణమాఫీ విషయంలో సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కానీ రైతులందరూ ఎవ్వరు కూడా ఆదార్యపడవద్దు వారి యొక్క సరైన వివరాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను తీసుకొని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అందరి కూడా రుణమాఫీ ఈ ప్రభుత్వం చేస్తుంది.ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధికారులు, ప్రజా ప్రతినిధులు వ్యవసాయ అధికారులు డైరెక్టర్లు రైతులు ప్రజలు నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.