ఇంటిని నిర్మించి ఇస్తానని హామీపెబ్బేరు మండలం గుమ్మడం తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్ అనే వికలాంగుడికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభయ హస్తాన్ని అందించారు.పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలనా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో గుమ్మడం తాండ వద్ద తన వాహనానికి ఎదురుగా వచ్చిన ఓ వికలాంగుడిని గుర్తించిన ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి వికలాంగులతో మాట్లాడారు.ఈ సందర్భంగా వికలాంగుడు ఎమ్మెల్యేతో తన గోడును విన్నవించుకున్నాడుగత పదేళ్లుగా తనకు ఇల్లు కావాలని ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న తనను ఎవరూ పట్టించుకోవడంలేదని తన భార్య సైతం వికలాంగురాలు కావడంతో కుటుంబానికి రోజు గడవడం కష్టంగా ఉందని దంపతులిద్దరూ వాపోయారు.గత ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్ రెడ్డిలో కి తన గోడును విన్నవించుకునేందుకు పలుమార్లు వెళ్లిన పట్టించుకోలేదని ప్రజల మధ్యన తన చేతులపై తొక్కుకుంటూ వెళ్ళాడు తప్ప తమతో మాట్లాడలేదని వారు వాపోయారునేడు దారికి వడ్డంగా వచ్చిన మమ్మల్ని గుర్తించి మాతో మీరు మాట్లాడడం మా సమస్యలను తెలుసుకోవడం మాకెంతో ఆనందంగా ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో పాటు ఇంటి నిర్మాణానికి కావలసిన ఖర్చు మొత్తం తానే భరిస్తానని వారికి హామీ ఇచ్చారుఎమ్మెల్యే వారిపై చూపిన ఆదరణకు ఎంతగానో సంతోషించినా దంపతులు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు