వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024— 25 విద్యా సంవత్సరం పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ గారితో కలిసి పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు.
పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ ఉమాదేవి గారు ఎమ్మెల్యే గారికి మరియు వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి పూల గుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.
పాఠశాలలు పునః ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే గారు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు బుక్స్,నోట్ బుక్స్,స్కూల్ డ్రెస్సెస్ కావలసిన అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేయడం జరిగింది.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వనపర్తి పట్టణంలోనే ప్రభుత్వ పాఠశాలలో,కాలేజీలో చదువుకున్నారు అన్ని విద్యార్థులకు ఎమ్మెల్యే గారు తెలియజేసారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా 9.5 గ్రేడ్ తెచ్చుకున్న విద్యార్థులను వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది