ఖిల్లా ఘనపూర్ మండలంలోని షాపూర్ గ్రామంలో జరిగిన చిన్న ఆంజనేయులు గారి కుమారుడు వివాహ వేడుకకు వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. సాయి చరణ్ రెడ్డి గారు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకలో సింగిల్ విండో అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు క్యామా రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, ఆగారం ప్రకాష్, యువ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మరియు గ్రామ ప్రముఖులు కూడా పాల్గొని, వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలిపారు