శంకర సముద్రం రిజర్వాయర్ ను పరిశీలించడం జరిగింది

రాష్ట్ర నీటి పారుదల శాఖ,పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి ,ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావ్ ,నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి,ఎమ్మెల్యే మధు సుధన్ రెడ్డి , రాష్ట్రస్థాయి నీటి పారుదల శాఖ అధికారులుతో కలిసి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం,కానాయపల్లి గ్రామంలోని శంకర సముద్రం రిజర్వాయర్ ను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల,రెవెన్యూ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా లోని పురోగతిలో ఉన్న,పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి,రాజీవ్ గాంధీ భీమా,మహాత్మా గాంధీ,జవహర్ నెట్టంపాడు,కోయల్ సాగర్,గట్టు వంటి నూతన సాగునీటి ప్రాజెక్టు లను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని మంత్రిగారు పేర్కొన్నారు.

అలాగే రాజీవ్ భీమా సాగునీటి ఎత్తిపోతల పథకం లోని శంకర సముద్రం అర్ అండ్ అర్ సమస్యలను పరిష్కరిస్తామనీ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,ఇరిగేషన్ శాఖ అధికారులు పునరావాస కేంద్రాల ఏర్పాటు,సాగునీటి కాలువల నిర్మాణానికి అయ్యే వ్యేయం,ఎంత ఆయకట్టు కు నీరు అందించగలం మన్నా పూర్తి నివేదికలను సమర్పించాలని మంత్రి గారు ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం లోని సాగునీటి ప్రాజెక్టు లను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.