సవాయిగూడెం గ్రామ వన మహోత్సవం

మొక్కలు నాటడంతో పాటు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి..

ప్రతి మొక్కను పసిపిల్లాడిల కాపాడుకోవాలి..

వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామ శివారులోనే ఫారెస్ట్ స్థలంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి..

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను పసిపిల్లాడిలా కాపాడుకోవాలని, లక్షల సంఖ్యలో మొక్కలు నాటడంపై పెట్టిన దృష్టిని వాటిని సంరక్షించే చర్యలపై దృష్టి సారించాలని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు సూచించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెట్లను పెంచడం ద్వారా పుష్కలంగా ప్రాణవాయువు లభించడంతోపాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రతి ఒక్కరు పుట్టినరోజులకు,పెళ్లిరోజులకు

ఇండ్ల వద్ద పంట పొలాల్లో వీలున్నప్పుడల్లా మొక్కలు నాటి వాటిని పెంచాలని ఆయన సూచించారు.

అధికారులు వారం వారం మొక్కల సంరక్షణపై రివ్యూ సమావేశం నిర్వహించి మొక్కల పెంపకానికి కావలసిన తగు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు జరిగింది.