వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన శివశంకర్ కరెంట్ షాక్ కు గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారి సహకారంతో CMRF మంజూరికి దరఖాస్తు చేసుకోగా ..రూ 60 వేలు మంజూరయ్యాయి.అలాగే వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండల తలుపునూరు గ్రామానికి చెందిన కౌసల్య అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారుఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారి సహకారంతో CMRF మంజూరికి దరఖాస్తు చేసుకోగా ..రూ 32 వేలు మంజూరయ్యాయి.మంజూరైన చెక్కును శనివారం ఎమ్మెల్యే వనపర్తి లోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.